“RRR” నటి ఆలియా లేటెస్ట్ సినిమా తెలుగులో కూడా రెడీ

“RRR” నటి ఆలియా లేటెస్ట్ సినిమా తెలుగులో కూడా రెడీ

Published on Sep 28, 2024 10:00 PM IST

బాలీవుడ్ లో మంచి టాలెంట్ కలిగిన స్టార్ హీరోయిన్స్ లో నటి ఆలియా భట్ కూడా ఒకరు. మరి తెలుగులో సెన్సేషనల్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో ఆమె తన డెబ్యూ అందించగా ఈ సినిమాతో అలాగే మరో చిత్రం “గంగూబాయి కతియావాడి” సినిమాతో మరింత దగ్గరైంది. ఇంకా సోషల్ మీడియాలో కూడా తెలుగు ఆడియెన్స్ కి ఆలియా సుపరిచితమే..

అయితే ఈమె నటించిన రీసెంట్ చిత్రమే “జిగ్రా”. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదాంగ రైనా సినిమలో మేల్ లీడ్ లో నటించాడు. అలాగే దర్శకుడు వాసన్ బాల తెరకెక్కించిన ఈ చిత్రం యూనిట్ రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ “దేవర” ప్రమోషన్స్ లో కూడా కలిసి కనిపించారు.

అయితే అయితే ఈ చిత్రాన్ని ఇన్ని రోజులు కేవలం హిందీలోనే రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా టాక్ ఉంది కానీ ఇప్పుడు ఈ చిత్రం హిందీ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. తెలుగులో పోస్టర్స్ కూడా బయటకి రాగ ఈ సినిమా హిందీ, తెలుగులో కూడా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ దసరా అయితే తెలుగులో మంచి టైట్ గానే కనపడేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు