లేటెస్ట్: “దేవర” ట్రైలర్ లాంఛ్ కి ఆల్ సెట్.. 

లేటెస్ట్: “దేవర” ట్రైలర్ లాంఛ్ కి ఆల్ సెట్.. 

Published on Sep 10, 2024 3:40 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “దేవర”. భారీ అంచనాలు పాన్ ఇండియా లెవెల్లో సెట్ చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాంఛ్ కోసం ముంబై లో గ్రాండ్ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఈ ట్రైలర్ లాంఛ్ అయ్యిన తర్వాత ఆన్లైన్ లోకి రానుంది అని ఇది వరకే తెలిపాము. అయితే అక్కడ ట్రైలర్ లాంఛ్ కి మొత్తం సిద్ధం చేసినట్టుగా మేకర్స్ చెబున్నారు.

స్టేజ్ అండ్ అతిధుల కోసం సెటప్ చేసిన విజువల్స్ ని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు షేర్ చేసి దేవర ఆగమనంపై మరింత హైప్ ఎక్కిస్తున్నారు. మరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ లు కూడా నటించారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు