“ది గ్రే మ్యాన్” కి సీక్వెల్ కూడా స్టార్ట్ కాబోతుందా.?


లేటెస్ట్ గా హాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ యాక్షన్ చిత్రం “ది గ్రే మ్యాన్”. అవెంజర్స్ ఫేమ్ రూసో బ్రదర్స్ క్రిస్ ఇవాన్స్, రియాన్ గోస్లింగ్ మరియు మన ఇండియన్ హీరో ధనుష్ లు నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులు కితమే దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది.

విడుదల అయ్యిన ఒక్క రోజు లోనే ఏకంగా 90కి పైగా దేశాల్లో ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే హైప్ తో మంచి స్పందనను అనుకున్నా సినిమా చూసాక మాత్రం వీక్షకుల నుంచి అంత మంచి ఫీడ్ బ్యాక్ ని అందుకోలేదు. రొటీన్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపించడంతో విమర్శకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది.

ఇక అయినా రెస్పాన్స్ ప్రకారం అయితే హిట్టే అని చెప్పాలి. మరి దీనితో అయితే ఎలాగో మేకర్స్ సీక్వెల్ కి లీడ్ కూడా ఇచ్చారు కాబట్టి మరి ఆల్రెడీ ఈ సీక్వెల్ పనుల్లో మేకర్స్ పడ్డారట. అదే స్క్రిప్ట్ రైటర్స్ తో సీక్వెల్ ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారని ఇందులో ధనుష్ రోల్ మరింత సాలిడ్ గా ఉండేలా ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఈ సినిమా అయితే ఎప్పటికి వస్తుందో చూడాలి.

Exit mobile version