“ఆచార్య” ఓటిటి రిలీజ్ మరో ఇంట్రెస్టింగ్ బజ్.!


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ అనుకున్న స్థాయి విజయాన్ని అయ్యితే అందుకోలేకపోయింది.

ఇక దీనితో థియేట్రికల్ రన్ ముగుస్తుండడంతో ఆలస్యం చెయ్యకుండా ఓటిటి లో ఈ సినిమా వచ్చేస్తున్నట్టుగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పలు డేట్స్ కూడా బయటకి రాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ దీనిపై వినిపిస్తుంది. ఓటిటిలో ఆచార్య బహుశా ఈ మే 20న కానీ 20 తర్వాత గాని స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version