“శ్యామ్ సింగ రాయ్” ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jan 19, 2022 2:50 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” కోసం అందరికి తెలిసిందే. తన కెరీర్ లో మరో మంచి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పించడమే కాకుండా థియేట్రికల్ గా కొన్ని ఇబ్బందులను కూడా అధిగమించి భారీ హిట్ అయ్యి గత ఏడాది టాలీవుడ్ సినిమాల్లో ఒక హిట్ గా నిలిచింది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు ఓటిటి లో రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుండగా లేటెస్ట్ గా ఇంకో అప్డేట్ తెలుస్తుంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ్ లో మాత్రమే స్ట్రీమింగ్ కి తీసుకొస్తారని టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఈ రెండు భాషలు సహా మళయాళం లో కూడా రిలీజ్ కానుందట.

నిజానికి ఈ మూడు భాషల్లో కూడా ఈ చిత్రం థియేట్రికల్ గానే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పరిస్థితుల రీత్యా కుదరలేదు. ఫైనల్ గా ఇలా అవుతుంది సో ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకి రానున్న రోజుల్లో మంచి అప్లాజ్ రావడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఈ మూడు భాషల్లో వచ్చే జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది.

సంబంధిత సమాచారం :