లేటెస్ట్ : 2024 సంక్రాంతి రేస్ లో మరొక మూవీ

లేటెస్ట్ : 2024 సంక్రాంతి రేస్ లో మరొక మూవీ

Published on Sep 24, 2023 2:00 AM IST

రానున్న 2024 సంక్రాంతి పండుగకి ఇప్పటికే టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజ్ డేట్ లని ఫిక్స్ చేసుకున్నాయి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక మూవీ గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. అయితే అదే రోజున తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల హనుమాన్ కూడా విడుదల కానుంది. అలానే నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న నా సామిరంగ కూడా సంక్రాంతికే రానుంది. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తీస్తున్న ఈగిల్ కూడా సంక్రాంతికి రానుందని మేకర్స్ ప్రకటించారు.

ఇక వీటితో పాటు విజయ్ దేవరకొండ, పరశురామ్ ల మూవీ కూడా అప్పుడే వచ్చే ఛాన్స్ ఉందని టాక్. కాగా లేటెస్ట్ గా సంక్రాంతి రేస్ లో మరొక డబ్బింగ్ మూవీ నిలిచింది. యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ అయలాన్ కూడా సంక్రాంతికి రానుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు. నిజానికి ఈ ఏడాది దీపావళికి రావాల్సిన ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానీ కారణంగా సంక్రాంతికి వాయిదా పడింది. అయితే ఒకేసారి ఇన్ని క్రేజీ సినిమాలు సంక్రాంతి రేస్ లో నిలిస్తే థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని,
మరి ఈ సినిమాల్లో పక్కాగా ఏది ఆ సమయంలో రిలీజ్ అవుతుందో, ఏది తప్పుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు