ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 లో తన మెరుగైన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసు గెలుచుకుని భారీ క్రేజ్, ఓటింగ్స్ తో ఫినాలే లో విన్నర్ గా నిలిచారు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే విన్నర్ గా గెలిచి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చిన ప్రశాంత్ కోసం అక్కడకు వచ్చిన పలువురు ఆయన అభిమానులు, అక్కడి పలు పబ్లిక్, ప్రైవేట్ వాహనాలు ధ్వంశం చేసారు. అలానే రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కారు పై పలువురు ప్రశాంత్ అభిమానులు రాళ్లతో దాడి చేసి విధ్వంశం సృష్టించారు.
అదే సమయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏసిపి మోహన్ కుమార్ అక్కడి పరిస్థితిని అదుపుచేసేందుకు వచ్చారు. అయితే మరికొందరు ప్రశాంత్ అభిమానులు ఆయన వాహనం పై కూడా దాడి చేశారు. దానితో పోలీసులు ప్రశాంత్ మరియు అతడి సోదరుడు మనోహర్ పై A 1, A 2 కేసులు నమోదు చేసారు. ఆ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ ని మరియు అతడి సోదరుడిని కొల్లూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం జూబిలీహిల్స్ పీఎస్ కు తరలించారు. అనంతరం రేపు వారిని కోర్ట్ కి హాజరు పరుచనున్నట్లు తెలుస్తోంది.