“సర్కారు వారి పాట”లో ఈ హంగు కూడానా?

Published on Jun 2, 2020 11:58 pm IST


ఎట్టకేలకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాత ప్రాజెక్ట్ ను మొదలుపెట్టేసారు. దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే సినిమాను మొదలు పెట్టి మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ జైత్ర యాత్రకు మొదలు ఇదే అని చెప్పారు.

దీనితో ఎన్నో అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి. ఓ పక్క ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా ఉండనుంది అని వినిపించింది.

ఇపుడు దీనితో పాటు మరో కోణం కూడా వినిపిస్తుంది. తన గత మూడు చిత్రాలతో సమాజానికి ఏదో ఒక సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించిన మహేష్ ఈ సినిమా ద్వారా కూడా ఓ స్ట్రాంగ్ మెసేజ్ ను ఇవ్వనున్నారని వినికిడి.

ఇప్పటికే కథపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి అని మళ్ళీ సరిగ్గా కుదిరినట్టయితే బాక్సాఫీస్ దగ్గర మరోసారి సరికొత్త లెక్కలు నమోదు కావడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More