రేపు ‘ఆదిపురుష్’ అప్డేట్ ఉందా ?

Published on Jan 18, 2021 6:48 pm IST


రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన చిత్రాల్లో బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ కూడ ఒకటి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటి నుండే సన్నద్దమవుతున్నారు. సన్నబడి కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. 2022 ఆగష్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ చేస్తున్న డైరెక్ట్ హిందీ చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇక రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ ఒకటి వస్తుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొందరైతే సినిమా రేపు అధికారికంగా లాంచ్ అవుతుందని అంటున్నారు. కొందరైతే సినిమాలోని హీరోయిన్ ఎవరనేది రివీల్ చేస్తారని చెబుతున్నారు. మరి ఆ అప్డేట్ ఏమిటో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :