ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తో తో అయితే తన కెరీర్ లో 108వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్ర చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో నిన్న తమన్నా కూడా ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చింది.
అయితే మరి బాలయ్య లైనప్ పై లు చిత్రాలు మంచి బజ్ ఉండగా ఈ లైనప్ లో మెగాస్టార్ దర్శకుడు బాబీ తో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది అనే దానిపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య అనీల్ రావిపూడితో కంప్లీట్ అయ్యాక ఇమీడియేట్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తో స్టార్ట్ చేయనున్నారు. మరి బోయపాటి తో ప్రాజెక్ట్ తర్వాత అయితే అయ్యితే బాబీ తో సినిమా ఉంటుంది అని లేటెస్ట్ సమాచారం. మరి వీరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.