బాలయ్య తర్వాతి మాస్ కాంబో పై లేటెస్ట్ బజ్.!

Published on Jan 21, 2021 11:17 pm IST

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఒక సరైన మాస్ సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలా ఇప్పుడు తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన హ్యాట్రిక్ సినిమాను చేస్తున్నారు. ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ కాలేదు కానీ టీజర్ తో మాత్రం భారీ హైప్ ను తెచ్చుకున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ రెండు రోజులు నుంచి బాలయ్య మరో సెన్సేషనల్ మాస్ కాంబోను సెట్ చేసారని ఇండస్ట్రీలో టాక్ విస్తృతంగా వినిపిస్తుంది. అదే లేటెస్ట్ మాస్ హిట్ “క్రాక్” దర్శకుడు గోపీచంద్ మలినేనితో..ఈ కాంబోలో తర్వాత ఓ సినిమా ఫిక్స్ అయ్యినట్టు ఇపుడు సమాచారం.

అంతే కాకుండా మరో బజ్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించనున్నారని మరో టాక్ మొదలయ్యింది. మొత్తానికి మాత్రం ఈ కాంబో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :