చిరు, అనీల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కాకుండా మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు చిరంజీవి నుంచి ఉండగా ఈ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న సాలిడ్ చిత్రం కూడా ఒకటి.

మరి మళ్ళీ చిరంజీవిని తన వింటేజ్ కామెడీ ట్రాక్ లో చూడాలి అనుకునేవారికి గట్టి ట్రీట్ లా అనీల్ ప్లాన్ చేస్తుండగా ఇపుడు ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ రానున్న ఏప్రిల్ మొదటి వారం లోనే మేకర్స్ గ్రాండ్ సినిమాని ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసి అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడ నుంచి ఫుల్ జోష్ లో సినిమాని మేకర్స్ కంప్లీట్ చేయనున్నారట. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. అలాగే సాహు గారపాటి నిర్మాణం వహించారు.

Exit mobile version