శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!?

శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!?

Published on Jan 4, 2025 11:00 AM IST

మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ములు తన సినిమా సినిమాకి ఎంత గ్యాప్ తీసుకుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే గత కొన్నేళ్ల కితం చేసిన “లవ్ స్టోరీ” తర్వాత కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ తో “కుబేర” అనే సినిమా అనౌన్స్ చేసి మంచి బజ్ రేపారు.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా స్టార్ట్ చేసి ఇన్నేళ్లు అయ్యినప్పటికీ ఇంకా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ గ్యాప్ లోనే ధనుష్ నుంచి “సార్”, “రాయన్” అనే రెండు సినిమాలు వచ్చేసాయి. ఇక నెక్స్ట్ “ఇడ్లీ కడై” అంటూ మూడో సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేసేసారు. కానీ కుబేర డేట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం కుబేర డేట్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 20 కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున సాలిడ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు