బాలీవుడ్ సినిమా నుంచి గత ఏడాది వచ్చిన పలు చిత్రాల్లో కాంట్రవర్సియల్ చిత్రం “ది కేరళ స్టోరీ” కూడా ఒకటి. యంగ్ హీరోయిన్స్ ఆదా శర్మ అలాగే సిద్ధి ఇద్నాని లు నటించిన ఈ చిత్రం నిజ జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ చిత్రం చిన్నగా స్టార్ట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.
అయితే ఈ సినిమా విడుదల అయ్యాక గతంలో వచ్చిన చిత్రం “కాశ్మీర్ ఫైల్స్” తరహాలోనే పలు కాంట్రవర్సీలకి దారి తీసింది. దీనితో థియేటర్స్ రిలీజ్ అనంతరం ఓటిటి రిలీజ్ కి చాలా ఇబ్బంది అయ్యింది. అప్పటికే ఈ సినిమా హక్కులు తీసుకున్న జీ 5 వారు ఈ రిలీజ్ ని నిలిపేశారు.
దీనితో ఈ సినిమాని మిస్ అయ్యినవారు చూద్దామనుకున్న వారు అందరికీ నిరాశే మిగిలింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ అవైటెడ్ సినిమా ఇప్పుడు రాబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఓటిటిలో కేరళ స్టోరీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.