మహేష్ 29 పై లేటెస్ట్ బజ్.!

మహేష్ 29 పై లేటెస్ట్ బజ్.!

Published on Jul 25, 2024 8:00 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గుంటూరు కారం” తో రీజనల్ గా మరో భారీ భారీ గ్రాసర్ ని మహేష్ తన ఖాతాలో వేసుకోగా ఈ చిత్రం చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమాని అయితే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్నాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు కానీ షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమా ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సినిమా షూటింగ్ ని మొదలు పెట్టడమే బయట దేశాల్లో సన్నివేశాలతో ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ రాజమౌళి కొన్ని చూడని ప్రదేశాలని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి వీటితో ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లని మొదలు పెట్టాలనుకుంటున్నారట. మరి ఈ అవైటెడ్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు