“ఎన్టీఆర్ 30” పై లేటెస్ట్ బజ్.!

Published on Feb 4, 2023 4:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తో ఓ భారీ పాన్ ఇండియా కోసం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన లాస్ట్ భారీ హిట్ చిత్రం రౌద్రం రణం రుధిరం చిత్రం గ్లోబల్ గా ఎలాంటి సంచలనం నమోడీ చేసిందో తెలిసిందే. దీనితో వరల్డ్ వైడ్ గా భారీ పాపులారిటీ తెచ్చుకున్న తారక్ నెక్స్ట్ కొరటాల శివతో సినిమాకి గాను జస్ట్ తన నామకరణంతోనే పాన్ ఇండియా లెవెల్లో ఎనలేని హైప్ ని సెట్ చేసి పెట్టాడు.

దీనితో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యి ఉన్న టీం భారీ సెట్ వర్క్స్ చేస్తుంది. అలాగే ఈ చిత్రం పై ఇప్పుడు మరో బజ్ అయితే తెలుస్తుంది. ఈ సినిమా షూట్ బహుశా ఈ మార్చ్ మధ్య నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. దీనితో ఈ చిత్రం ఇప్పుడైనా స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :