తారక్, నీల్ భారీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలతో లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివ తో “దేవర” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా దీని తర్వాత పాన్ ఇండియా వైడ్ గా మరిన్ని భారీ సినిమాలు తన లైన్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసేది కూడా ఒకటి.

మరి ఈ భారీ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ఏప్రిల్ నుంచే సినిమా మొదలు కావాల్సి ఉంది కాని పలు కారణాలతో అది సాధ్య పడలేదు. అయితే ఇప్పుడు సినిమా షూట్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఎన్టీఆర్ నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. అప్పటికి ఎన్టీఆర్ “వార్ 2” లో తన పోర్షన్ లు కంప్లీట్ చేసుకోవచ్చని టాక్. మరి నీల్ సలార్ 2 ని కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేస్తాడని బజ్ ఉంది మరి అదీ స్టార్ట్ చేసి రెండూ ఏకకాలంలో చేస్తాడా అనేది వేచి చూడాలి.

Exit mobile version