ప్రభాస్ సాలిడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Nov 28, 2020 7:00 am IST

అనుకోని విధంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేపట్టిన పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటైన నాగశ్విన్ తో చిత్రం కాస్త వెనక్కి వెళ్ళింది. నిజానికి ఆదిపురుష్ కన్నా ముందే లైన్ లో పెట్టిన ఈ భారీ చిత్రం కాస్త ఆలస్యం గానే మొదలు కానుండడం ఖరారు అయ్యింది. ఇది వరకు ప్రభాస్ చేయని తరహా చిత్రం అందులోను మన తెలుగులో కూడా అంతగా టచ్ చెయ్యని రేర్ స్కై ఫై జానర్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరి అలాంటి ఈ సాలిడ్ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కూడా ఒక భాగస్వామ్యం అయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈయన రోల్ పైనే టాక్ వినిపిస్తుంది. అమితాబ్ ఈ చిత్రంలో కేవలం గెస్ట్ రోల్ చేయట్లేదట.

సినిమా ఆధ్యంతం తన రోల్ నడుస్తుంది అని అలాగే పలు యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా ఆయన ఉండే అవకాశం ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా వైజయంతి మూవీస్ వారు 500 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More