మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ భారీ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ అలాగే ఆడియో పనులు కూడా చేస్తున్నారు.
మరి రీసెంట్ గానే మేకర్స్ కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ అదిరిపోతోంది అని కూడా తెలిపారు. మరి ఇలా లేటెస్ట్ గా “విశ్వంభర” ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ సాంగ్ ఈ శివరాత్రి కానుకగా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చాలా ఏళ్ల తర్వాత చిరు, కీరవాణి కలయిక జరిగింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతానికి మే రిలీజ్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.