మాస్ మహారాజ్ ‘అనిమల్’ నటి కాంబినేషన్ పై క్లారిటీ.!

మాస్ మహారాజ్ ‘అనిమల్’ నటి కాంబినేషన్ పై క్లారిటీ.!

Published on Dec 6, 2023 9:00 AM IST

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమననేని కాంబినేషన్ లో ఓకే క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ “ఈగల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి నిన్ననే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాగా ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ చిత్రం తర్వాత మాస్ మహారాజ్ లైనప్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.

రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ “అనిమల్” లో కనిపించి అందరి దృష్టి ఆకర్షించిన యంగ్ నటి త్రిప్తి రవితేజ సరసన నటిస్తుంది అంటూ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ కాంబినేషన్ పై ఇప్పుడు నిజం తెలుస్తుంది. అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఇవన్నీ కేవలం కావాలని స్ప్రెడ్ చేసిన వార్తలు తప్ప ఈ కాంబినేషన్ పై ఎలాంటి చర్చ రాలేదని తెలుస్తుంది. దీనితో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు