లేటెస్ట్ క్లిక్స్ : వైజాగ్ లో ల్యాండ్ అయిన వరుణ్ తేజ్, సాక్షి వైద్య

లేటెస్ట్ క్లిక్స్ : వైజాగ్ లో ల్యాండ్ అయిన వరుణ్ తేజ్, సాక్షి వైద్య

Published on Aug 22, 2023 4:35 PM IST

టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా హీరోగా నటిస్తున్న మూవీ గాండీవధారి అర్జున. ఈ మూవీలో ఏజెంట్ మూవీ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా ప్రవీణ్ సత్తారు దీనిని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

అయితే ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింత భారీ క్రేజ్ ఏర్పరిచిన గాండీవధారి అర్జున్ టీమ్ నేడు వైజాగ్ లోని అవంతి కాలేజీ స్టూడెంట్స్ తో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవ్వనున్నారు. అందుకోసం కొద్దిసేపటి క్రితం హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాక్షి వైద్య ఇద్దరూ కూడా వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు