లేటెస్ట్ క్లిక్స్ : పద్మవిభూషణ్ మెగాస్టార్ కు మెగాసుప్రీం హీరో స్పెషల్ కంగ్రాట్స్


నిన్న మన భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిన పద్మ అవార్డుల్లో భాగంగా దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి లభించిన విషయం తెలిసిందే. దీనితో ఒక్కసారిగా మెగాస్టార్ పై అందరి నుండి గొప్ప గా ప్రసంశలు కురిసాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖలతో పాటు అభిమానులు సైతం మెగాస్టార్ కి శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

మ్యాటర్ ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన తల్లి విజయదుర్గ తో కలిసి తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి పద్మవిభూషణ్ అవార్డు లభించిన శుభసందర్భంగా ఆయనకు పుష్ప గుచ్ఛం అందించి స్పెషల్ గా కంగ్రాట్స్ తెలిపారు. కాగా వారి కలయిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version