లేటెస్ట్ క్లిక్స్ : కాబోయే వధూవరులను ఆశీర్వదించిన మోహన్ బాబు

లేటెస్ట్ క్లిక్స్ : కాబోయే వధూవరులను ఆశీర్వదించిన మోహన్ బాబు

Published on Feb 8, 2024 12:06 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరైన మంచు మోహన్ బాబు ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా తనయుడు మంచు విష్ణు నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ ఫాంటసీ మూవీ కన్నప్పలో ఆయన ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. విషయం ఏమిటంటే, అతి త్వరలో ఒక్కటి కానున్న నూతన జంట అయిన దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్, అద్వైత రెడ్డి లను ఆశీర్వదించారు మోహన్ బాబు.

ఫిబ్రవరి 14న ఆశిష్, అద్వైత ల వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరుగనున్న నేపథ్యంలో కాబోయే వధూవరులతో కలిసి మోహన్ బాబు గారికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు దిల్ రాజు. అయితే వారి వివాహ సమయానికి తాను ఇండియాలో ఉండబోవడంలేదని, అందుచేత నూతన వధూవరులకు తన పూజా మందిరం వద్ద దండలు మార్పించి తన ఆశీస్సులు అందించారు మోహన్ బాబు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు