టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” విడుదల సమయంలో జరిగిన విషాద ఘటన అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశంలో అల్లు అర్జున్ ఊహించని విధంగా జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ఘటన ఉండగా ఉండగా మరింత తీవ్ర రూపం దాలుస్తు వచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై నేడు కొందరు దాడులు చేయడం కలకలం రేపింది.
దీనితో ఇది మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేటెస్ట్ గా స్పందించడం వైరల్ గా మారింది. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నాను అని తెలిపారు. అలాగే శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసు వారికి ఆదేశాలు జారే చేస్తున్నట్టుగా తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటూ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024