లేటెస్ట్..నాగ్ “గోస్ట్” నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.!

Published on Jul 7, 2022 10:58 am IST

మన టాలీవుడ్ సీనియర్ స్టార్ అండ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరోస్ లో ఒకరైన అక్కినేని నాగార్జున హీరోగా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది గోస్ట్” కోసం కోసం అందరికీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ ను భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు ఒక క్రేజీ అనౌన్సమెంట్ ని అయితే అందించారు.

నాగ్ నుంచి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ సినిమా ఫస్ట్ విజువల్ ని ఈ జూలై 9న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో అయితే నాగ్ వింటేజ్ లుక్స్ లో కనిపిస్తున్నారని చెప్పాలి. కత్తి పట్టుకొని ఉన్న నాగ్ ఒక కిల్లింగ్ మెషిన్ అంటూ మేకర్స్ ప్రెజెంట్ చేస్తున్నారు.

మొత్తానికి అయితే ఈ సినిమాపై ఉన్న హైప్ కి తగ్గట్టుగా ప్లానింగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మరి ఈ ఫస్ట్ విజువల్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :