‘పుష్ప 2’కి వేయి కోట్లు వస్తాయా ?

‘పుష్ప 2’కి వేయి కోట్లు వస్తాయా ?

Published on Aug 26, 2024 8:00 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు తెలుగు సినిమాల మార్కెట్ రోజురోజుకు బాలీవుడ్ లో పెరుగుతుంది.

పైగా ఈ మధ్య హిందీ ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 మూవీ ఓవరాల్ గా రూ. 600 కోట్ల గ్రాస్ రాబట్టేలా ఉంది. అంటే.. కంటెంట్ కనెక్ట్ అయితే ఆ సినిమాకి వందల కోట్ల వసూళ్లు రావడం పక్కా. మరి ఈ నేపథ్యంలో పుష్ప 2 కి మంచి పాజిటివ్ టాక్ వస్తే.. రూ.1000 కోట్లు రావొచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగూ, అన్ని భాషల ఆడియన్స్ లో ఈ సినిమా పై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు