విషాద కారణంతో “డాకు మహారాజ్” ఈవెంట్ రద్దు!

విషాద కారణంతో “డాకు మహారాజ్” ఈవెంట్ రద్దు!

Published on Jan 9, 2025 10:01 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి బాలయ్య అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఈ సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

అయితే ఈ చిత్రం అవైటెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ నేడు అనంతపురంలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ ని రద్దు చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇటీవల తిరుమల సన్నిధిలో జరిగిన తీవ్ర విషాద కారణంగా తమ వేడుకలు జరపడం లేదని కన్ఫర్మ్ చేశారు. ఆ దుర్ఘటన పట్ల తమ టీం అంతా చింతిస్తున్నామని అందుకే ఈవెంట్ ని నిలిపివేశామని అందరూ అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు