“సరిపోదా శనివారం” నాన్ థియేట్రికల్ హక్కులు డీటెయిల్స్


నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. తమ కాంబినేషన్ నుంచి వచ్చిన గత చిత్రం “అంటే సుందరానికీ” అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. దీనితో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలి అన్నట్టు ఫిక్స్ అయ్యి చేసిన సినిమానే “సరిపోదా శనివారం”.

ఇక మరో వారంలో రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా నా థియేట్రికల్ హక్కుల సంబంధించి డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫిక్స్ ఓటిటి హక్కులు కొనేసుకున్న సంగతి తెలిసిందే. ఇది అన్ని భాషలకి కలిపి కాగా ఇక టెలివిజన్ హక్కులు అయితే మన తెలుగులో జీ సంస్థలు తీసుకున్నాయి.

జీ తెలుగు అలాగే జీ సినిమాలు వారు తెలుగులో తీసుకోగా హిందీ హక్కులని అయితే కలర్స్ సినీ ప్లెక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా తాజాగా రివీల్ అయ్యింది. ఇలా మొత్తంగా అయితే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ పరంగా సినిమా బిజినెస్ లని క్లోజ్ చేసేసుకుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version