మన టాలీవుడ్ సినిమాలో బిగ్ స్టార్స్ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే వాటి తాలూకా ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి అలాంటి స్టార్ హీరోస్ లో ఒకరైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమానే “దేవర”. ఈ సినిమా గ్రాండ్ తెలుగు ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఫైనల్ గా ఈ సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్ లో ప్లాన్ చేశారు.
కానీ ఈ ఈవెంట్ రద్దు చేయబడిన వార్త ఇపుడు ఫ్యాన్స్ ని దారుణంగా డిజప్పాయింట్ చేసింది. అక్కడ ప్రాంగణంకి అనుకున్న దానికంటే ఎక్కువగా అభిమానులు తరలి రావడంతో ఈవెంట్ ని నిలిపివేశారు. అలాగే కొందరు అత్యుత్సాహ అభిమానుల వల్ల ఈవెంట్ హాల్ పాక్షికంగా ధ్వంసం కూడా అయ్యింది అని దీనితో భద్రతా పరమైన కారణాలు రీత్యా ఈవెంట్ ని మేకర్స్ నిలిపేశారు.
మరి ఎంతో అసలు పెట్టుకొని వచ్చిన అభిమానులకి అయితే ఇది పెద్ద నిరాశే అని చెప్పుకోవాలి. ఇంకా సినిమా రిలీజ్ కి నాలుగు రోజులు సమయం ఉంది. మరి ఈ గ్యాప్ లో అవుట్ డోర్ లో ఏమన్నా ఈవెంట్ ని తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేస్తారో లేక ఈవెంట్ లేకుండానే సినిమాని రిలీజ్ కి తీసుకొస్తారో అనేది చూడాలి.