లేటెస్ట్: “డబుల్ ఇస్మార్ట్” మూడో సాంగ్ కి డేట్ ఫిక్స్

లేటెస్ట్: “డబుల్ ఇస్మార్ట్” మూడో సాంగ్ కి డేట్ ఫిక్స్

Published on Jul 26, 2024 7:37 PM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ హీరోయిన్ కావ్య థాఫర్ హీరోయిన్ గా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ క్రేజీ మాస్ సీక్వెల్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. మరి రామ్, పూరి కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ “ఇస్మార్ట్ శంకర్” తర్వాత దానికి సీక్వెల్ గా చేస్తున్న ఈ సినిమాపై సాలిడ్ బజ్ నెలకొంది. మరి ఈ సీక్వెల్ నుంచి ఆల్రెడీ రెండు పాటలు వచ్చి సాలిడ్ హిట్స్ కూడా అయ్యాయి.

ఇక ఇపుడు మూడో సాంగ్ ని అయితే మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేసేసారు. క్యా లఫ్డా అంటూ సాగే ఈ సాంగ్ మెయిన్ లీడ్ నడుమ ఉన్నట్టుగా ఇద్దరిపై మంచి పోస్టర్ రిలీజ్ చేసి మణిశర్మ నుంచి మరో హిట్ సాంగ్ రాబోతుంది అని తెలుపుతున్నారు. ఇక ఈ సాంగ్ ఈ జూలై 29న రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే దీని తాలూకా ప్రోమో రిలీజ్ రేపు జూలై 27న వస్తున్నట్టుగా రివీల్ చేశారు. మరి ఈ ట్యూన్ ఎలా ఉంటుందో వినాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఛార్మి, పూరిలు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ కి ఈ చిత్రం రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు