నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్ 109వ మూవీగా NBK 109 వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ని నేడు మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసారు మేకర్స్. థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, బాలకృష్ణ ఆకట్టుకునే డైలాగ్స్ తో ఈ గ్లింప్స్ పవర్ఫుల్ గా రూపొందింది.
‘ఏంటిరా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటూ విలన్ అడిగిన ప్రశ్నకు, సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదు రా లఫుట్, ఇట్స్ కాల్డ్ హంటింగ్’ అంటూ బాలకృష్ణ ఈ గ్లింప్స్ లో చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ క్రేజీ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి