లేటెస్ట్..ఈ భాషలో కూడా రిలీజ్ కానున్న “గాడ్ ఫాథర్”.!

Published on Sep 24, 2022 4:00 pm IST

ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సాలిడ్ పొలిటికల్ ఎంటర్టైనర్ “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు జయం మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ని అయితే జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కి సమయం దగ్గరకి వస్తుంది.

దీనితో తెలుగు సహా హిందీ రిలీజ్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉండగా ఇప్పుడు అయితే ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. తాజాగా ఈ సినిమా మళయాళం రిలీజ్ పోస్టర్ లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఆల్రెడీ మళయాళ సినిమా కి రీమేక్ గా చేశారు. మరి మళ్ళీ ఇదే చిత్రాన్ని అక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి అక్కడ ఎలాంటి ఆదరణ ఈ సినిమా అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :