రెబల్ పాత్రలో సమంత

రెబల్ పాత్రలో సమంత

Published on May 18, 2021 6:04 PM IST


అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో మొదటిసారి భారీ లెవల్లో విజయం సాధించిన వెబ్ సిరీస్ ఇదే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ రూపొందుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ రేపు 19వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సీజన్ 2లో సమంత కూడ ఒక కీ రోల్ చేస్తోంది. ఆమె చేస్తున్న పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుసు కానీ పాత్ర ఏమిటనేది ఇన్నిరోజులు తెలియలేదు.

అయితే తాజాగా తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు సమంత ఒక తమిళ రెబల్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు బయటకి వచ్చిన సమంత లుక్స్ చూస్తే ఈ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఇలాంటి పాత్రలో నటించడం సమంతకు ఇదే మొదటిసారి. దక్షిణాది ప్రేక్షకులు అయితే ఆమె పాత్ర మీద మంచి అంచనాలు పెట్టుకుని ఉన్నారు. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ సెకండ్ సీజన్ జూన్ 11వ తేదీన విడుదలవుతుందని తెలుస్తోంది. మరి ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవముందో తెలియాలంటే రేపు ట్రైలర్ రిలీజయ్యే వరకు ఆగాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు