సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆల్రెడీ “వేట్టయన్” ఈ దసరా కానుకగా రిలీజ్ కి కూడా రాబోతుంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుంది. కానీ ఈ వెంటనే రజినీకాంత్ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనే వార్త అభిమానులని కంగారు పెట్టింది.
అయితే రజిని ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు సమాచారం తెలుస్తుంది. రజిని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారట. అయ్యి ఇంటికి కూడా వెళ్లారని తెలుస్తోంది. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పారట. సో తలైవర్ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని చెప్పాలి. ఇక రజిని ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో “కూలీ” అనే మరో భారీ సినిమా చేస్తుండగా ఇందులో అక్కినేని నాగార్జున సాలిడ్ రోల్ చేస్తున్నారు.