థలపథి67 తెలుగు శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానల్!


గత కొద్ది రోజులుగా థలపథి67 విజయ్ అభిమానులు సూపర్ జోష్ లో ఉన్నారు. విజయ్ కొత్త చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చిత్ర కథానాయిక మరియు ఆడియో భాగస్వామి వివరాలను వెల్లడించారు. 14 ఏళ్ల తర్వాత విజయ్‌తో కలిసి త్రిష నటించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. చిత్రం కి సంబంధించిన ప్రారంభోత్సవ వీడియో ను విడుదల చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం ఇంకా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయక ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టివి ఛానల్ జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా, బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తుండగా, మనోజ్ పరమహంస కెమెరా క్రాంక్ చేస్తున్నారు.

Exit mobile version