టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేతులు కలిపారు. SVC58 పేరుతో తెరకెక్కుతున్న కాప్ డ్రామా లో నటించనున్నారు వెంకటేష్. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లు కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ లో హీరో వెంకటేష్ ఆగస్ట్ నెలలో జాయిన్ కానున్నారు. సినిమాను పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.