“తుంబాడ్” దర్శకుడు భారీ సిరీస్ అఫీషియల్ టైటిల్ వచ్చేసింది.!

“తుంబాడ్” దర్శకుడు భారీ సిరీస్ అఫీషియల్ టైటిల్ వచ్చేసింది.!

Published on Jul 27, 2024 11:47 AM IST

మన ఇండియన్ సినిమా మూవీ లవర్స్ లో తాము చూసిన కొన్ని ది బెస్ట్ ఇండియన్ సినిమాల లిస్ట్ చెప్పమంటే అందులో ఖచ్చితంగా ఉండే సినిమా పేరు “తుంబాడ్”. బాలీవుడ్ దర్శకుడు రాహి అనీల్ బార్వే తెరకెక్కించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రాన్ని మూవీ లవర్స్ అంతా ఒక అండర్ రేటెడ్ జెమ్ అని పిలుస్తారు. మరి ఇలాంటి సినిమాని అందించిన దర్శకుడు నుంచి వస్తున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అందరిలో మరింత ఆసక్తి నెలకొంటుంది.

అలా గత కొన్ని రోజులు నుంచి సినీ వర్గాల్లో గట్టిగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బజ్ వినిపిస్తుంది. మరి ఈసారి తాను భారీ తారాగణం సమంత, వామికా గబ్బి, అలీ ఫజల్ లాంటి వారితో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీ దర్శకులు రాజ్ అండ్ డీకే లతో క్రేజీ వెబ్ సిరీస్ ని చేస్తున్నట్టుగా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ గా ఈ సిరీస్ పై సాలిడ్ అప్డేట్ తో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు వచ్చారు.

గతకొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ టైటిల్ “రక్త్ బ్రహ్మాండ్” అనే పేరుతోనే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు ఒక కిరీటం దానిపై కారుతున్న రక్తాన్ని ఇందులో చూడొచ్చు. దీనితో ఈ సిరీస్ పట్ల ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ ఈ సిరీస్ మొదలు పెట్టినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు