లేటెస్ట్: ఎన్టీఆర్, నీల్ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ వచ్చేసింది.!


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ కూడా ఒకటి. అనధికారికంగా “డ్రాగన్” అంటూ పిలవబడుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎపుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ భారీ సినిమా నేడు హైదరాబాద్ లో అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

అయితే ఈ కార్యక్రమం అనంతరం మేకర్స్ రిలీజ్ డేట్ సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ చిత్రం 2026 జనవరి 9న థియేటర్స్ లోకి రాబోతున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ భారీ చిత్రం నుంచి మాస్ ఫీట్ అప్పటికి లాక్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండగా ఈ చిత్రాన్ని కూడా పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Exit mobile version