లేటెస్ట్..ఇండియాకి సేఫ్ గా చేరుకున్న తారక్.!

లేటెస్ట్..ఇండియాకి సేఫ్ గా చేరుకున్న తారక్.!

Published on Jan 2, 2024 7:16 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ఇప్పుడు “దేవర” అనే భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి నిన్ననే మేకర్స్ మాసివ్ అప్డేట్ కూడా అందించగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇదిలా ఉండగా తారక్ రీసెంట్ గానే వెకేషన్ కోసం జపాన్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఊహించని విధంగా భూకంపాలు మొదలయ్యి జపాన్ దేశాన్ని కుదిపేసాయి.

దీనితో అక్కడ తీవ్ర నష్టం వాటిల్లగా మరో పక్క ఎన్టీఆర్ తన కుటుంబంతో అక్కడే ఉన్నాడన్న మాట అభిమానుల్లో టెన్షన్ గా మారింది. మరి తాజాగా తారక్ అయితే తన విషయంలో అప్డేట్ అందించాడు. తాను ఇండియాకి సేఫ్ గా చేరుకున్నాను అని తెలిపాడు. కానీ జపాన్ కి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది అని తిరిగి వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపాడు. దీనితో తారక్ ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో కాస్త ఊరట ఇచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు