లేటెస్ట్ : యుఎస్ఏ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తున్న ‘లియో’

లేటెస్ట్ : యుఎస్ఏ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తున్న ‘లియో’

Published on Oct 18, 2023 3:01 AM IST

ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ లియో. ఈ మూవీ అనౌన్స్ మెంట్ టైం నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచింది. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ఎంతో ఆకట్టుకుని మూవీ పై ఆ అంచనాలు భారీగా పెంచేసాయి.

అక్టోబర్ 19న లియో మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా లియో మూవీ యుఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఈ మూవీకి 55000 కు పైగా టికెట్స్ అమ్ముడవగా వాటి ద్వారా 1.25 మిలియన్ డాలర్స్ రాబట్టింది. చూడబోతే ఎల్లుండికల్లా ఇది 1.75 మిలియన్ వరకు చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి రిలీజ్ అనంతరం లియో ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు