“అఖండ” బ్యానర్ నుంచి లేటెస్ట్ మాసివ్ ప్రాజెక్ట్.!

Published on May 30, 2023 2:28 pm IST


టాలీవుడ్ సినిమా దగ్గర నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ అలాగే తన సెన్సేషనల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన ఐకానిక్ హ్యాట్రిక్ చిత్రానికి అయితే నిర్మాణం వచ్చిన నిర్మాణ సంస్థగా ద్వారకా క్రియేషన్స్ వారు పరిచయం అయ్యారు. మరి వారు రావడంతోనే భారీ హిట్ ని సొంతం చేసుకొని రికార్డు వసూళ్లు లాభాలు అందుకోగా ఇప్పుడు మేకర్స్ అయితే తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇపుడు అనౌన్స్ చేశారు.

ఇక ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనుండగా దీనిని మాస్ ప్రాజెక్ట్ గా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ పోస్టర్ కూడా వదిలారు. ఇక ఈ చిత్రం హీరో ఎవరు ఇతర డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ అసలు ట్రీట్ అయితే ఈ జూన్ 2న ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. ఈ డేట్ న ఈ సినిమా నుంచి టైటిల్ సహా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఆరోజు అయితే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై అసలు క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :