లేటెస్ట్ : గ్రాండ్ గా లంచ్ అయిన మెగాస్టార్ ‘156 మూవీ’

లేటెస్ట్ : గ్రాండ్ గా లంచ్ అయిన మెగాస్టార్ ‘156 మూవీ’

Published on Oct 23, 2023 9:46 PM IST


ఇటీవల మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి దానితో ప్లాప్ ని చవి చూసారు. దానితో కొంత ఆలోచన చేసిన మెగాస్టార్ ఇకపై స్టోరీల ఎంపిక విషయమై మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తన కెరీర్ 156వ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు మెగాస్టార్. ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీ నేడు దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ గా అధికారిక పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.

కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందించనుండగా దీనిని సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు దర్శకుడు వశిష్ట. ఇక ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుండగా మూవీలో నటించే హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. కాగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని వంశీ, ప్రమోద్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు