లేటెస్ట్ : నాని ‘హాయ్ నాన్న’ ఓటిటి పార్ట్నర్ లాక్


నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషనల్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీని యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీనిని గ్రాండ్ గా నిర్మించింది. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ మూవీలోని సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక రేపు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది హాయ్ నాన్న మూవీ. విషయం ఏమిటంటే, తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి హాయ్ నాన్న మూవీ రేపు రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version