టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బాబీ కియారా ఖన్నా కీలక పాత్ర చేసింది. మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ చేసుకుంది ఈ మూవీ.
ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు నాని. విషయం ఏమిటంటే, తాజాగా లేటెస్ట్ ట్రెండీ స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో నాని దిగిన ఫోటోషూట్ తాలూకు పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపై తన నుండి మాస్ సినిమాలు కూడా వస్తాయని, అలానే తప్పకుండా ఆడియన్స్, ఫ్యాన్స్ ఆశించే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని హాయ్ నాన్న సక్సెస్ మీట్ లో భాగంగా నాని మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే.