డిసెంబర్‌ లో ‘హరిహర వీరమల్లు’ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్‌ ఇక 20-25 రోజులు కేటాయిస్తే సినిమా మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆగస్టు మొదటి వారంలో పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. అన్నట్టు డిసెంబర్‌లో ఈ మూవీ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయట. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది.

Exit mobile version