‘బన్నీ’ పాత్ర పై కొత్త రూమర్ ?

‘బన్నీ’ పాత్ర పై కొత్త రూమర్ ?

Published on Feb 12, 2024 8:38 PM IST

‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే, ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ యాక్షన్ అండ్ ఎమోష‌న‌ల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్ పై ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో అల్లు అర్జున్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు