బాలయ్యతో ఆ యంగ్ హీరో ?

బాలయ్యతో ఆ యంగ్ హీరో ?

Published on Sep 16, 2024 8:00 AM IST

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు కాంబినేషన్‌ లో ‘అఖండ 2’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి బిజీగా ఉన్నాడు. ఐతే, స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీనటుల పై కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో నటిస్తున్నాడట.

దర్శకుడు బోయపాటి శ్రీను, విశ్వక్ సేన్ కోసం ఓ స్పెషల్ రోల్ రాశాడని.. సెకండ్ హాఫ్ లో ‘విశ్వక్ సేన్’ పాత్ర వస్తోందని తెలుస్తోంది. బాలయ్యకి విశ్వక్ సేన్ సన్నిహితంగా ఉంటాడు. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతాయి. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అన్నట్టు ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు