యాక్షన్ సీక్వెన్స్ కి బాలయ్య రెడీ ?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఎన్నికల కారణంగా బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడు. కాగా నిన్నటితో ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో బాలయ్య మళ్లీ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ నెల నాలుగో వారం నుంచి బాలయ్య పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షైన్ టామ్ కూడా షూట్ లో జాయిన్ కానున్నాడు. ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version