మెగాస్టార్ ‘విశ్వంభర’లో థ్రిల్లింగ్ సీక్వెన్స్

మెగాస్టార్ ‘విశ్వంభర’లో థ్రిల్లింగ్ సీక్వెన్స్

Published on Feb 12, 2024 10:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో మెగాస్టార్ – విలన్స్ పై భారీ యాక్షన్ సీన్స్ ను ఘాట్ చేస్తారట. ఈ సీన్స్ లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయట. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మెగాస్టార్ చిరంజీవి గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి, ఈ యాక్షన్ సీన్స్ లో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర కూడా అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఈ సినిమాలో హైలైట్ అవుతుంది అని ఇప్పటికే దర్శకుడు వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. అందుకే, మెగా ఫ్యాన్స్ ఈ సినిమా పై ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. కాగా UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు