మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చే ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ అయితే తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ ధరకి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో సినిమా వచ్చేది థియేటర్స్ రన్ జరిగిన 50 రోజుల తర్వాతే అని తెలుస్తుంది. దీనితో ఈ మధ్య కాలంలో వచ్చేస్తున్న నెల రోజుల గ్యాప్ లో కాకుండా 7 వారాల అగ్రిమెంట్ తో అయితే మేకర్స్ దేవర డీల్ చేసుకున్నారట. సో 50 రోజుల వరకు దేవర ఓటిటిలో రాదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సెప్టెంబర్ 27 న భారీ ఎత్తున రిలీజ్ కి రాబోతుంది.